గురువారం, 8 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: మంగళవారం, 31 జనవరి 2023 (17:36 IST)

ఇలియానాకు అనారోగ్యం.. ఆసుపత్రి బెడ్ పైన పోకిరీ భామ

Ileana
పోకిరి భామ ఇలియానా అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఇలియానా తల్లి చెప్పింది. తనకు సకాలంలో మంచి వైద్యం అందించారని పేర్కొంది. అలాగే హెల్త్ అప్డేట్ ను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. ఒక రోజులో చాలా మార్పు వచ్చింది. 
 
డాక్టర్లు సెలైన్స్ పెట్టారు. తన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలామంది తనకు మెసేజ్ లు పంపుతున్నారని.. వారికి కృతజ్ఞతలు అని చెప్పింది. డాక్టర్లు సరైన సమయంలో మంచి వైద్యం అందించారని రాసింది. 
 
ఇకపోతే, తన కూతురి అనారోగ్యంపై ఇలియానా తల్లి స్పందించింది. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలిపారు. దీంతో ఆమె డీహైడ్రేషన్ కు గురైందని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా వుందని వెల్లడించారు.