శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (11:26 IST)

జ్యూస్ అనుకుని సోప్ సొల్యూషన్ తాగారు.. అంతే ఆస్పత్రిలో...?

చైనాలో జ్యూస్‌ని ఆర్డర్ చేసిన కస్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. అంతేగాకుండా జ్యూస్‌కు బదులు సబ్బు ద్రావణాన్ని తాగారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. చైనాలోని జెజియాంగ్ ప్రాంతంలో ప్రముఖ రెస్టారెంట్ నడుస్తోంది. ఆ రెస్టారెంట్‌లో వుగాంగ్ అనే మహిళ తన బంధువులు, ఆరుగురు స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ జ్యూస్ ఆర్డర్ చేశారు. 
 
సప్లయర్ ఇచ్చిన జ్యూస్ తాగేసరికి గొంతులో మంట వచ్చింది. దీంతో వారందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. వారిని పరీక్షించిన వైద్యులు సబ్బు ద్రావణం తాగినట్లు పరీక్షల్లో తేలింది. 
 
సప్లయర్‌కు కంటిచూపు లోపం ఉందని, డబ్బా జ్యూస్ బాటిల్‌లా ఉండడంతో పొరపాటున సోప్ సొల్యూషన్ పోశాడని రెస్టారెంట్ వారు వివరణ ఇచ్చారు. 
 
అలాగే, చైనాలో చాలా సోప్ సొల్యూషన్ డబ్బాలు రంగులు జ్యూస్ బాటిళ్లను పోలి ఉన్నందున గందరగోళంగా ఉన్నాయని చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.