శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (13:23 IST)

భూటాన్, చైనా మధ్య సరిహద్దు వివాదం.. చర్చలు జరుగుతాయా?

india vs china
భూటాన్, చైనా మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడంతో అధికార స్థాయిలో చర్చలు జరిపి సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. 
 
చైనా-భూటాన్ సరిహద్దు సమస్యలపై నిపుణుల బృందం 11వ సమావేశం నవంబర్ 10 నుంచి 13 వరకు చైనాలోని కున్మింగ్‌లో జరిగింది. ఈ మేరకు ఇరు దేశాలు నిన్న సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. 
 
11వ ఎక్స్ పర్ట్ గ్రూప్ సమావేశంలో పారదర్శక, సుహృద్భావ, నిర్మాణాత్మక వాతావరణంలో చైనా-భూటాన్ సరిహద్దు చర్చలను వేగవంతం చేసేందుకు ఎంవోయూ అమలుపై లోతైన అభిప్రాయాల మార్పిడి జరిగింది. అలాగే ఏకాభిప్రాయం కుదిరింది.