గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (15:43 IST)

భారతీయులు పాశ్చాత్యులు సమానమే : రాజమౌళి

newyark asward
newyark asward
దర్శకుడు రాజమౌళి న్యూయార్క్‌లో ఈరోజు అవార్డు అందుకున్నారు. దానికి సంబంధించిన ప్రశంసాపత్రం పోస్ట్‌ చేశారు. ఆయన అక్కడ మాట్లాడిన మాటలు యావత్‌ ప్రపంచాన్ని మంత్రముగ్థుల్ని చేశాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాకు న్యూయార్క్‌ ఫిలిం క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డు 2022కు ఆయన దక్కింది. గత కొద్దిరోజులుగా అవార్డుకు ఎంపికైందన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నేడు ఓ పోస్ట్‌ పెట్టాడు. ఈరోజు తాను అవార్డు అందుకున్నట్లు తెలిపారు. 
 
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, భారతీయులు ఎలా ఆర్‌.ఆర్‌.ఆర్‌.సినిమాను పిచ్చెక్కినట్లు చూశారో పాశ్చాత్యులు అంతే ఇదిగా చూశారు. ఈ సందర్భంగా గ్లోబల్‌ బ్లాక్‌ బస్టర్‌గా మార్చినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, న్యూయార్క్‌లో ఈ వేడుక జనవరి 11న జరగనుంది. ఇందుకోసం రెడీ అవుతున్నట్లు రామ్‌చరన్‌ ఇటీవలే కొత్త సూట్‌తో బయలుదేరుతున్నట్లు పిక్‌లు పెట్టారు. ఆ తర్వాత ఎన్‌.టి.ఆర్‌.కూడా ఇప్పటికే అక్కడ వున్నారు. కాగా, రాజమౌళితో పాన్‌ వరల్డ్‌ సినిమా తీసేందుకు విదేశీయులు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.