మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (09:32 IST)

ఆహారం కూడా భుజించలేని స్థితిలో హీరోయిన్ ఇలియానా

IleanaD'Cruz
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన గోవా బ్యూటీ ఇలియానా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆహారం కూడా భుజించలేని పరిస్థితి ఉంటూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వార వెల్లడించారు. 
 
"ఒక రోజులో చాలా మారొచ్చు. కొంతమంది లవ్లీ డాక్టర్లు, మూడు బ్యాగుల ఫ్లూయిడ్స్" అని పేర్కొంటూ ఓ ఫోటోని ఆమె షేర్ చేసారు. దానికి కొనసాగింపుగా "నా ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసేందుకు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. వారి ప్రేమ పొందడం నిజంగా నా అదృష్టం. ప్రస్తుతాని నేను క్షేమంగా ఉన్నాను. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకున్నాను" అంటూ వెల్లడించారు. 
 
కాగా, ఇలియానా కలుషిత ఆహారం ఆరగించడం వల్ల ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.