శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 28 సెప్టెంబరు 2022 (15:50 IST)

కోవిడ్-19 నుండి కోలుకున్న వారి ఊపిరితిత్తులు వారి గుండె గురించి ఏమి చెబుతున్నాయి?

Heart
కోవిడ్-19 నుండి కోలుకున్నవారు, వారి ఊపిరితిత్తులపై కోవిడ్ యొక్క దీర్ఘకాలిక ప్రభావం గురించి తరచుగా ఆందోళన చెందుతారు. పరిశోధకులు, వైద్యులు ఇప్పుడు వారి హృదయాల గురించి కూడా కేర్ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులు, గుండె ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. యూకే ఆధారిత జర్నల్ 'సర్క్యులేషన్'లో ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, కోవిడ్ -19 నిర్ధారణ అయిన వ్యక్తులు గుండెపోటు లేదా స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం 21 రెట్లు ఎక్కువ, ఇది ప్రాణాంతక రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.

 
ఈ అధ్యయనం రెండు అవయవాల మధ్య గల సంబంధం మీద కొత్త దృష్టిని తీసుకువచ్చింది, ఆస్తమా, ILD (ఇంటర్‌స్టీషియల్ ఊపిరితిత్తుల వ్యాధి), COPD (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు తప్పనిసరిగా కార్డియాక్ ఎవల్యూషన్ కోసం వెళ్లాలని భారతదేశంలోని వైద్యులు ఇప్పుడు చెబుతున్నారు.

 
“మన రక్త ప్రసరణలో ఎక్కువ భాగం ఊపిరితిత్తులు, గుండె మధ్య జరుగుతుంది. అయినప్పటికీ, చికిత్సల విషయానికి వస్తే రెండింటి మధ్య గల సంబంధం తరచుగా విస్మరించబడుతుంది,’’ అని డాక్టర్ అత్రి గంగోపాధ్యాయ, కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్, రాంచీ, జార్ఖండ్- జాతీయ ప్రతినిధి, భారత చెస్ట్ కౌన్సిల్ అన్నారు. “ఎవరైనా ఊపిరితిత్తుల సమస్యను ఎదుర్కొన్నప్పుడు, ఊపిరితిత్తులకు మాత్రమే చికిత్స చేయడంపై దృష్టి పెడతారు. అదేవిధంగా, ఎవరికైనా గుండె సమస్య వచ్చినప్పుడు, దృష్టి అంతా గుండెపైకి వెళుతుంది. గుండె- ఊపిరితిత్తుల రెండింటి కారణంగా ఒక లక్షణం సంభవించవచ్చు అనే ఆలోచన చాలా అరుదుగా మనస్సులోకి ప్రవేశిస్తుంది.” అని డాక్టర్ గంగోపాధ్యాయ అన్నారు.

 
కోవిడ్-19తో బాధపడుతున్న, కోలుకుంటున్న వ్యక్తులలో ఊహించని గుండెపోటుల సంఖ్య పెరగడంతో, వైద్యుల ప్రకారం, అవయవాలను ఒక్కొక్కటిగా పరిశీలించే ప్రాక్టీస్ త్వరలో ముగియవచ్చు. "మన శరీరంలో, ఏ అవయవం కూడా వేరుగా, ఒంటరిగా పనిచేయదు, అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఒక వ్యవస్థ ఎల్లప్పుడూ మరొకదానిపై ప్రభావం చూపుతుంది" అని డాక్టర్ రాజన్ శెట్టి, HoD, కార్డియాలజీ విభాగం, మణిపాల్ హాస్పిటల్‌, బెంగళూరు, అన్నారు.

 
“మన శరీరంలోని అత్యంత సన్నిహిత సంబంధాలలో గుండె, ఊపిరితిత్తుల మధ్య ఉన్న సంబంధం కూడా ఒకటి.” అని డాక్టర్ శెట్టి అన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, మహమ్మారి ప్రారంభ దశలో, కోవిడ్-19 డెల్టా వేరియంట్ ఆవిర్భావం సమయంలో, గుండెపోటు వచ్చిన ప్రతిసారీ, మరణాల ప్రమాదం 10 రెట్లు పెరిగింది. “మేము కోవిడ్-19 సమయంలో రెండు విషయాలను గమనించాము. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత లేదా కోవిడ్‌తో బాధపడుతున్న తర్వాత గుండెపోటు రేటు పెరగడం” అని డాక్టర్ శెట్టి చెప్పారు.

 
చైనా, ఇటలీలో కోవిడ్ -19 బాధితుల పోస్ట్‌మార్టం నివేదికలు కూడా వారి రక్త నాళాలలో అధికంగా రక్తం గడ్డకట్టడాన్ని చూపించాయి. “కోవిడ్ ఖచ్చితంగా మన రక్త నాళాలను కూడా ప్రభావితం చేసే ఒక విధమైన వ్యాధికి దోహదం చేస్తుంది. కాబట్టి, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రోగి, కోలుకోలేనప్పుడు, వారు తప్పనిసరిగా కార్డియోలాజికల్ ఎవల్యూషన్ కూడా పొందడం చాలా ముఖ్యం.”అని డాక్టర్ శెట్టి అన్నారు. మిస్టర్ గణేష్ ప్రసాద్, ఫౌండర్, MD & CEO జెన్‌వర్క్స్, ఇలా అన్నారు, “జెన్‌వర్క్స్ సొల్యూషన్స్ కేర్ సైకిల్ అవసరాలను పరిష్కరించడంపై దృష్టి సారించాయి. కోవిడ్ తర్వాత ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం పెరిగింది.

 
గుండె మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని అంచనా వేయడం చాలా ముఖ్యం. డయాగ్నోస్టిక్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్‌లో భాగంగా గుండె చెకప్ కూడా ఒకటిగా మారింది. మేము ఇప్పటికీ లెగసీ స్పిరోమీటర్‌ను ఉపయోగిస్తాము, ఇది ఎగువ శ్వాసకోశాన్ని మాత్రమే అంచనా వేస్తుంది. కనుక ఉపయోగించడం చాలా కష్టం. ఊపిరితిత్తుల ఎవల్యూషన్‌ను సులభతరం చేయడానికి డయాగ్నోస్టిక్స్ వద్ద ఊపిరితిత్తుల డిఫ్యూజన్ పరీక్షలకు ప్రస్తుతం సమయం ఆసన్నమైంది. ఒక నాణ్యమైన స్పిరోమీటర్, 6 నిమిషాల నడక పరీక్ష లేదా ఊపిరితిత్తుల డిఫ్యూజన్ పరీక్ష అనేది వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లో ముఖ్యమైన భాగం.’’

 
ఆయనే చెపుతూ, "గుండె, ఊపిరితిత్తుల కోసం మా అనుసంధానించబడిన సంరక్షణ పరిష్కారాలు సైట్‌లో కార్డియాలజిస్ట్ లేదా పల్మోనాలజిస్ట్ లేని, తక్కువ వనరులు గల సెట్టింగ్‌లలో రిమోట్‌గా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. వరల్డ్ హార్ట్ డే నాడు, పెద్ద అనారోగ్యాన్ని నివారించగల సాధారణ పరీక్షలతో గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.'' అని అన్నారు.