షూటింగులో సొమ్ముసిల్లి పడిపోయిన నాగశౌర్య .. ఆస్పత్రిలో అడ్మిట్
టాలీవుడు యువ హీరో నాగశౌర్య అస్వస్థతకు లోనయ్యారు. ఆయన షూటింగులో ఉన్నట్టుండి సొమ్ముసిల్లిపడిపోయారు. దీంతో యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తన కొత్త చిత్రం కోసం ఆయన సిక్స్ ప్యాక్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కఠినమైన డైట్ నియమాలు పాటిస్తున్నారు. పైగా సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోవడంతో ఆయన కాస్త నీరసంగా ఉంటున్నారు.
అదేసమయంలో తాను కమిట్ అయిన చిత్రాల కోసం విశ్రాంతి లేకుండా షూటింగులో పాల్గొనడంతో ఆయన ఒక్కసారిగా సొమ్ముసిల్లిపడిపోయారు. ఆహారం తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగివుంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.