గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (09:37 IST)

అత్యంత విషమంగా ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి ఆరోగ్యం

bhageeratha reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికితోడు కొన్ని రోజులుగా ఆయనకు దగ్గు ఎక్కువైంది. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతుండటంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఆయన ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన బంధువు చల్లా రఘునాథ రెడ్డి తెలిపారు. భగీరథను తొలుత వెంటిలేటరుపై ఉంచి 100 శాతం ఆక్సిజన్ ఇచ్చారని, ఇపుడు దీన్ని 60 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. పైగా, చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందని తెలిపారు.