సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (09:09 IST)

ఏపీకి అప్పు తీసుకోనిదే పూట గడవడం లేదు.. మరో రూ.1413 కోట్ల రుణం

ysjagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్పుల కోసం పోటీ పడింది. ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజరైన ఏపీ ఆర్థిక శాఖ అధికారులు మరోమారు 1413 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు.  ఏడేళ్ళ కాల వ్యవధికి కూ.7.75 శాతం వడ్డీతో రూ.700 కోట్లను సేకరించింది. 
 
అలాగే, మరో రూ.713 కోట్లను 11 యేళ్ల కాలపరిమితితో 7.86 శాతం వడ్డీకి సేకరించింది. భారత రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో జరిగిన సెక్యూరిటీ బాండ్ల వేలం పాటల్లో పాల్గొన్న ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ఈ రుణాలు తీసుకున్నారు.
 
ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళుతోందంటూ విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకునిపోతూ రుణాలుపై రుణాలు తీసుకునే విషయంలో పోటీపడుతోంది.