గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (10:56 IST)

30 ఏళ్ల ప్రియురాలితో పృథ్వీ రాజ్ విడాకులు.. పెళ్లి చేసుకోలేదు.. కానీ?

Prithivee
Prithivee
నటుడు బబ్లూ పృథ్వీ రాజ్ విడాకులు తీసుకున్నాడు. తన 30 ఏళ్ల ప్రియురాలితో తెగతెంపులు చేసుకున్నాడు. తన కంటే 30 ఏళ్లు జూనియర్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించి.. అందరినీ ఆశ్చర్యపరిచిన పృథ్వీకి మొదటి వివాహం ద్వారా ఒక అబ్బాయి వున్నాడు. 
 
ఫిట్ అండ్ ఫ్యాబ్ పృథ్వీరాజ్ చెన్నైకి చెందిన తెలుగు అమ్మాయి రుక్మిణి శీతల్‌తో తన ప్రేమాయణాన్ని గురించి మాట్లాడాడు. రుక్మిణి శీతల్‌తో కలిసి ఫోటోలు, వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవాడు.  
 
అయితే తాజాగా రుక్మిణి శీతల్ తన సోషల్ మీడియా పేజీలో పృథ్వీతో తనకు సంబంధం లేదని, తాము విడిపోయామని పోస్ట్ చేసింది.
 
 ఇంకా రుక్మిణీ పృథ్వీతో తనకు వివాహం కాలేదని.. తాము లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అయితే, మేము ఆశించిన విధంగా విషయాలు జరగలేదు. ఇది కొనసాగడానికి సమయం కాదు. కాబట్టి విడిపోతున్నాం." అంటూ చెప్పుకొచ్చింది. 
 
పృథ్వీ రాజ్ పెళ్లి, సమర సింహారెడ్డి, నువ్వు నాకు నచ్చావుతో తెలుగు సినిమాల్లో కనిపించాడు. తాజాగా రామ్ పోతినేని దర్శకత్వంలో "స్కంధ" సినిమాలో నటించాడు. టెలివిజన్ సీరియల్స్‌లో నటుడిగా పనిచేస్తున్నాడు.