శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (15:48 IST)

80 ఏళ్ళ వృద్ధుడు గ‌న్ ప‌ట్టాడు సాయం చేస్తున్నా - రామ్‌చ‌ర‌ణ్‌

Ram charan
ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రాజ‌మౌళి ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. అక్క‌డ అద్భుత‌మైన ప్ర‌దేశాలున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ రూపురేఖ‌లు మారిపోయాయి. అవి త‌ల‌చుకుంటుంటే బాధ‌వేస్తుంద‌ని రామ్‌చ‌ర‌ణ్ తెలియ‌జేస్తున్నారు. అస‌లు ఉక్రెయిన్ ఎలా వుంటుందో తెలీదు. అలాంటి టైంలో మేం షూటింగ్ చేశాం. అక్క‌డ ప్ర‌జ‌లు చాలా పాజిటివ్ కోణంలో వుంటారు. అతిథుల‌ను బాగా చూసుకుంటారు.
 
నేను అక్క‌డ షూటింగ్‌లో వున్నంత‌కాలం నాకు భ‌ద్ర‌త‌గా ఓ వ్య‌క్తి చాలా జాగ్ర‌త్త‌గా చూసుకున్నాడు. ఇప్పుడు యుద్ధం జ‌రుగుతుంది. యోగ‌క్షేమాలు తెలుసుకున్నాను. వాళ్ళ నాన్న‌గారికి 80 ఏళ్ళు. ఆ వ‌య‌స్సులో గ‌న్ ప‌ట్టుకుని త‌న‌వాళ్ళ‌ను కాపాడుకుంటున్నాడ‌ట‌. విష‌యం తెలిసి చ‌లించిపోయాను. స‌రైన తిండి దొర‌క‌డంలేదు. అందుకే వారి ఖాతాలో డ‌బ్బులు పంపాను. ఉక్రెయిన్ ప్ర‌జ‌ల్లో కొత్త విష‌యాలు తెలుసుకోవాల‌నే త‌ప‌న వుంటుంది. ఇప్పుడు యుద్ధ‌వాతావ‌ర‌ణంలో అక్క‌డి ప్ర‌జ‌ల‌ను చూస్తుంటే జాలేస్తుంది. త్వ‌ర‌లో అన్ని స‌ర్దుబాటు కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.