శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (15:43 IST)

అభినవ్ సర్దార్ మిస్టేక్ రాబోతుంది

Abhinav Sardar, J Sunny, Manas, Sohail, srikanth and others
Abhinav Sardar, J Sunny, Manas, Sohail, srikanth and others
ఇటీవలే రామ్ అసుర్ సినిమాతో హీరోగా కూడా మెప్పించిన అభినవ్ సర్దార్ ఇప్పుడు మిస్టేక్ సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వంలో అభినవ్ సర్దార్ హీరోగా ఆయన సొంత నిర్మాణంలో ASP బ్యానర్ పై మిస్టేక్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
 
తాజాగా మిస్టేక్ సినిమా ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ మిస్టేక్ ట్రైలర్ ఆవిష్కరించారు. ఇంకా VJ సన్నీ, మానస్, సోహైల్, సింగర్ రేవంత్, నటుడు బెనర్జీ, లోహిత్ కుమార్, విక్రమాదిత్య, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ జీవన్, లగడపాటి శ్రీధర్, చైతన్యకృష్ణ.. పలువురు సినీ, వ్యాపార  ప్రముఖులు విచ్చేశారు. యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో మిస్టేక్ ట్రైలర్ అందర్నీ మెప్పించింది. అభినవ్ సర్దార్ సిక్స్ ప్యాక్ తో చేసిన యాక్షన్ సీన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయని అదితులు ఆకాంక్షించారు. అంతరం వారంతా తమ లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ ని షేర్ చేసుకున్నారు. కొంతమంది సరదాగా మాట్లాడి ఎంటర్టైన్ చేశారు. ఈవెంట్ కి విచ్చేసిన ప్రముఖులు చిత్రయూనిట్ ని అభినందించి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. మిస్టేక్ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.
 
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సర్దార్ నాకు తమ్ముడు లాంటోడు, మంచి ఫ్రెండ్. ఎప్పట్నుంచో అతను నాకు తెలుసు. చాలా రంగాల్లో సర్దార్ విజయం సాధించాడు. సినిమాల్లో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా వచ్చాడు. ఈ సినిమా మీద సర్దార్ కి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. విలన్ గా నాకు పోటీ వచ్చిన పర్లేదు. చిన్న సినిమాలే మంచి సక్సెస్ సాధిస్తాయి. ఈ టీంకి పనిచేసిన వాళ్లందరికీ అల్ ది బెస్ట్ అని తెలిపారు.        
 
అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. ఇది ఒక చిన్న సినిమా. మన అందరికి మెగాస్టార్ చాలా ఇష్టం, ఆయన వరకు మనం వెళ్లకపోవచ్చు కానీ నా మెగాస్టార్ మాత్రం మీరే శ్రీకాంత్ అన్న. ఏ టైంలో కాల్ చేసినా డైరెక్ట్ లిఫ్ట్ చేసి మాట్లాడాతారు. ఎంత ఎదిగినా ఇలా సింపుల్ గానే ఉంటారు. శ్రీకాంత అన్న అడగ్గానే ఈవెంట్ కి వచ్చారు. నాకు సొంత అన్నలాగా ఉంటారు. ఇండస్ట్రీలో చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా ఒక మిస్టేక్ తోనే మొదలుపెట్టాం. నేనెప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా పర్ఫెక్షన్ తోనే అన్ని చేస్తాను. 2010 నుంచి సినిమాలు చేస్తున్నాను. నేను ఎన్ని బిజినెస్ లు చేసినా, సినిమాలు, సోషల్ సర్వీస్ చేసినా చాలా క్లారిటీగా, 100 శాతం చేస్తాను. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. ఈ సినిమా చేసేటప్పుడు భుజానికి గాయం అయింది. ఇప్పటికి కూడా ఇంకా జిమ్ కి వెళ్లట్లేదు ఆ గాయం వల్ల. కెమెరా మెన్ హరి, సంగీత దర్శకుడు మణి జిన్నా, ఈ సినిమాకి పని చేసినా వాళ్లందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.                                        
        
డైరెక్టర్ సన్నీ అలియాస్ భరత్ కొమ్మాలపాటి మాట్లాడుతూ.. 2021 లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా చేశాం. చాలా మంది ఈ సినిమాకు కష్టపడ్డాం. ఈ సినిమా నెక్స్ట్ మంత్ రానుంది. శ్రీకాంత్ అన్న గెస్ట్ గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన గెస్టులందరికి థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మళ్ళీ మాట్లాడతాను అని సినిమాకి పని చేసిన వాళ్లందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు.