సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (09:26 IST)

అబ్బే ''సంజు'' నాకు నచ్చలేదు.. త్రిషాలా దత్

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 20 కోట్లకు పైగా వసూలైంది. దీంతో భారత మార్క

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  తొలి మూడు రోజుల్లో రూ. 20 కోట్లకు పైగా వసూలైంది. దీంతో భారత మార్కెట్లో ''సంజు'' వసూళ్లు రూ. 150 కోట్లకు చేరువయ్యాయి. ఈ చిత్రంలో సంజు పాత్రలో రణ్ బీర్ కపూర్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
అయితే ఈ సినిమా పట్ల సంజయ్ దత్ కుమార్తె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు బిటౌన్‌లో చర్చ సాగుతోంది. ఈ సినిమా తనకు నచ్చలేదని సంజయ్ దత్ కుమార్తె త్రిషాలా దత్. సంజయ్ జీవితంలో ఎంతో ప్రాధాన్యమున్న తన తల్లి పాత్రను ఈ చిత్రంలో చాలా తక్కువ నిడివిలో చూపించారని త్రిషాలా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇక ఈ చిత్రంలో రిచా శర్మను సంజయ్ మొదటి భార్యగా చూపించారు. సినిమాలో ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువ. రిచాశర్మతో విడిపోయిన తరువాత సంజయ్ దత్, మాన్యతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మాన్యతతో త్రిషాలాకు ఎలాంటి విభేదాలూ లేనప్పటికీ, తన తల్లి పాత్రను ఇంకాస్త నిడివిలో చూపించి వుంటే బాగుండేదని త్రిషాలా అభిప్రాయం వ్యక్తం చేస్తుందని సమాచారం.