శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (14:47 IST)

ఇందిరమ్మ పాత్రలో నటించాలనుంది.. మనీషా కొయిరాలా

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా మనసులోని మాటను వెలిబుచ్చింది. అత్యంత శక్తివంతమై

బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు బయోపిక్‌ల జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుందని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా మనసులోని మాటను వెలిబుచ్చింది. అత్యంత శక్తివంతమైన మహిళగా ఇందిరాగాంధీ కనిపిస్తారని, ఆమె పాత్రలో కనిపించేందుకు సిద్ధంగా వున్నానని మనీషా చెప్పింది. 
 
ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. దేశ ప్రజలను ఆమె ప్రభావితం చేసిన తీరు అపూర్వమని మనీషా కొయిరాలా కొనియాడింది. ఆదర్శవంతమైన ప్రధానిగా వెండితెరపై కనిపించాలనేది తన చిరకాల కోరిక అని మనీషా చెప్పుకొచ్చింది. 
 
16 యేళ్ల క్రితమే తాను ప్రధాన పాత్రగా ఇందిరాగాంధీ బయోపిక్‌కి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి. ఎన్.చంద్ర దర్శకుడిగా కొంత హోమ్ వర్క్  జరిగిందంటూ మనీషా గుర్తు చేసుకుంది. మనీషా ప్రస్తుతం సంజయ్‌ దత్‌ బయోపిక్‌లో నర్గిస్ దత్ పాత్రలో కనిపిస్తోంది. మరి ఇందిరమ్మ సినిమాకు మనీషాను ఎంపిక చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తారో లేదో వేచిచూడాలి.