ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (13:02 IST)

జయలలిత సమాధికి హీరో అజిత్ నివాళులు... భార్య షాలినితో..

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత సమాధి వద్ద తమిళ హీరో అజిత్ నివాళులు అర్పించారు. ఆయన బుధవారం తెల్లవారుజామున మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు తన భార్య షాలినితో వచ్చి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత సమాధి వద్ద తమిళ హీరో అజిత్ నివాళులు అర్పించారు. ఆయన బుధవారం తెల్లవారుజామున మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు తన భార్య షాలినితో వచ్చి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలంటూ దైవాన్ని ప్రార్థించారు. 
 
కాగా, ముఖ్యమంత్రి జయలలిత అంటే అజిత్‌కు ప్రత్యేకమైన అభిమానం. జయలలితను అజిత్ కన్నతల్లిగా భావిస్తూ వచ్చారు. అలాగే, అజిత్ అంటే జయలలితకు కూడా ప్రత్యేకమైన అభిమానం. దీనికి నిదర్శనంగా పలుమార్లు అజిత్‌ను పోయస్ గార్డెన్‌లోని తన ఇంటికి జయలలిత పిలిపించి మాట్లాడారు కూడా. అప్పటి నుంచి జయలలిత రాజకీయ వారసుడు అజిత్ అంటూ విస్తృతమైన ప్రచారం కూడా ఉంది. 
 
ఈనేపథ్యంలో జయలలిత చనిపోయిన సమయంలో అజిత్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బల్గేరియా దేశంలో ఉన్నాడు. అమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే అజిత్ షూటింగ్ రద్దు చేసుకుని చెన్నైకు బయలుదేరారు. అయినప్పటికీ తల్లిలాంటి అమ్మను కడసారి చూడలేక పోయారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.