శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (12:53 IST)

సునీల్ గ్రోవర్‌కు హార్ట్ సర్జరీ: షూటింగ్ పూర్తి చేశాకే సర్జరీకి వెళ్ళాడట!

Sunil Grover
దేశంలోని టాప్ కమెడియన్లలో ఒకరైన సునీల్ గ్రోవర్ జీఫైవ్ వెబ్ సిరీస్ "స్నో ఫ్లవర్"లో, గత సంవత్సరం సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి "తాండవ్"లో కూడా కనిపించాడు. నటుడు సిరీస్‌లో కీలక పాత్ర పోషించాడు.

అమెజాన్ ప్రైమ్ వీడియో రాజకీయ నాటకం వివాదంలో ఉంది. పెద్ద తెరపై సునీల్ చివరిగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో కలిసి "భరత్"లో కనిపించాడు. ఈ సినిమాలో సల్మాన్ స్నేహితుడిగా నటించాడు. 
 
ఈ నేపథ్యంలో సునీల్ గ్రోవర్‌కు హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. కపిల్ శర్మ కామెడీ షోతో పాటు సినిమాల్లో అనేక పాత్రలు చేసి పాపులర్  అయిన సునీల్ గ్రోవర్‌కు తన వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో ఉండగా ఛాతీ నొప్పి వచ్చిందట.

దీంతో చిత్రబృందం అతన్ని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సునీల్ గ్రోవర్ ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు.
 
అయితే ఎలాంటి సర్జరీ చేయించుకున్నాడో మాత్రం గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడి ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గుండెలో నొప్పి ఉన్నపటికీ షూట్ పూర్తి చేసే సర్జరీకి వెళ్ళాడట ఈ పాపులర్ కమెడియన్.