బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2024 (14:18 IST)

రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్.. పూల వర్షం.. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ అవార్డ్స్ (video)

Ramcharan
Ramcharan
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా విడుదల సందర్భంగా యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల ఎత్తున్న కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విశేషమైన కటౌట్ ఆవిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కటౌట్‌ను ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ రామ్ చరణ్ అభిమానుల అభిమానం చూస్తుంటే ఆయనకు మరో పెద్ద హిట్ తథ్యమని వ్యాఖ్యానించారు. ఈ కటౌట్‌కు ఇంటర్నేషనల్ వండర్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు లభించింది. 256 అడుగుల ఎత్తుతో ఇది ప్రపంచంలోని అతిపెద్ద కటౌట్‌గా గుర్తింపు పొందింది.
 
రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం గేమ్‌ ఛేంజర్‌ శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. 
 
విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్‌ కటౌట్‌ ఏర్పాటు చేశారు. గేమ్ ఛేంజర్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.