ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (12:21 IST)

'కాంచన-3' నటికి లైంగిక వేధింపులు... నటుడు అరెస్టు

తమిళ హీరో రాఘవ లారెన్స్ తాజా చిత్రం "కాంచన-3". ఈ చిత్రంలో నటించిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరు రష్యన్ భామ. ఆమె పేరు నిక్కీ తంబోలి. ఈమె పదేళ్ళ క్రితం చెన్నైకు తన భర్త, భార్యాపిల్లలతో వచ్చేసింది. స్థానిక ఎంఆర్సీ నగర్‌లో నివాసం ఏర్పరచుకుంది. తరచూ వాణిజ్య ప్రకటనలు కనిపిస్తూ, సినిమాల్లో నటిస్తూ జీవితాన్ని గడుపుతూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ నటించిన తాజా చిత్రం "కాంచన-3"లోనూ నటించింది. ఈమెపై నటుడు రుబేశ్ కుమార్ (26) లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈయన కూడా గతంలో అనేక వ్యాపార ప్రకటనల్లో నటించారు. అయితే, అనేక మందికి సినీ అవకాశాల పేరు చెప్పి, పలు భంగిమల్లో ఫోటోలు తీశాడని, ఆపై వాటిని తన వాట్స్ యాప్‌కు పంపుతూ, కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని, కోరిక తీర్చకుంటే, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన నేర విభాగం పోలీసులు రుబేశ్ కుమార్‌ను అరెస్టు చేశారు.