శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (11:20 IST)

నిర్మాతను ఆ విధంగా సంతోష పెట్టిన సాయిపల్లవి

సాయి పల్లవి. ఈ పేరు ఇపుడు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఫిదా చిత్రం తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఫిదా చిత్రంలో వచ్చినంత పేరు ఈ చిత్రాల్లో రాలేదు. తాజాగా శర్వానంద్ హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా పడి పడి లేచె మనసు చిత్రం వచ్చింది. 
 
ఈ చిత్ర కథ ప్రేక్షకులుకు బోర్ కొట్టించేలా సాగింది. ఫలితంగా ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో చిత్ర నిర్మాతకు కొంతమేరకు నష్టాలు వచ్చాయి. దీంతో నిర్మాతను తనవంతుగా ఆదుకోవాలని సాయి పల్లవి భావించింది. 
 
అయితే ఈ విష‌యం సాయిప‌ల్ల‌వికి కూడా చేర‌డంతో త‌న రెమ్యున‌రేష‌న్‌ని తిరిగి నిర్మాత‌ల‌కే ఇచ్చేసిందని అంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు స్టార్ హీరోలు మాత్ర‌మే త‌మ రెమ్యున‌రేష‌న్‌ని ఇలా తిరిగి ఇచ్చేసిన సంద‌ర్భాలు చూశాం. 
 
కానీ నిర్మాత బాగోగులు ఆలోచించిన హీరోయిన్ త‌న పారితోషికాన్ని తిరిగి ఇవ్వడమనేది గొప్ప విష‌యం అని అంటున్నారు. సాయి ప‌ల్ల‌వి చేసిన ప‌నికి ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. సాయి ప‌ల్ల‌వి న‌టించిన "మారి 2" కూడా ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సూర్య కూడా ఓ చిత్రంలో నటిస్తోంది.