సమంతకు అరుదైన గౌరవం: ఎంతో గర్వంగా వుంది..
ప్రముఖ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా సమంత ఆహ్వానం అందుకుంది. ఈ ఫెస్టివల్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఆగస్టు 12న ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'గతేడాది ఐఎఫ్‌ఎఫ్‌ఎంలో భాగమయ్యానని తెలిపింది. కొద్దికాలానికే భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.
కాగా, సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే పాన్ ఇండియా మూవీ 'యశోద' షూటింగ్ జరుపుకుంటోంది. ఇక విజయ దేవరకొండకు జంటగా 'ఖుషి' సినిమాలో నటిస్తోంది.