సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 20 మే 2020 (23:30 IST)

సినీ కార్మికులకు నటుడు శివాజీ రూ. 2 లక్షల ఆర్థిక సాయం

లాక్ డౌన్ సమయంలో తెలుగు పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్న వారికి హీరో, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబెర్ శివాజీ 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. షూటింగ్స్ లేని కారణంగా ఎంతోమంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. 
 
అలాంటి వారికి సహాయం చెయ్యడానికి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సీనియర్ మెంబర్, హీరో శివాజీ ముందుకు వచ్చారు. గతంలో ఎన్నో సేవ కార్యక్రమమాలు నిర్వహించడమే కాకుండా ఎవరికి ఆపద వచ్చిన చురుగ్గా పాల్గొనే శివాజీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కి టి.ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ద్వారా 2 లక్షల చెక్‌ను అందజేశారు. 
 
ఇబ్బందులుపడుతున్న వారికి హెల్ప్ చేయడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని శివాజీ తెలిపారు. ఆపదలో ఉన్న సినీ కార్మికులకు ఈ సమయంలో ఆదుకోవడంతో టి.ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల శివాజీకి అభినందనలు తెలిపారు.