Daily Horoscope
✕

సింగర్ సునీత భర్త తెలివైనవాడు.. సినీ నటుడు వేణు

Written By సెల్వి
Updated: శనివారం, 1 అక్టోబరు 2022 (14:23 IST)
సినీ నటుడు వేణు ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను మనిషిని కాబట్టి తనకూ ఎమోషన్స్ ఉంటాయని నెగిటివ్‌గా జరిగితే రెండు రోజులు బాధ ఉంటుందని చెప్పారు. 
 
భగవంతుడు అందమైన జీవితం ఇచ్చాడని వేణు తెలిపారు. లైఫ్‌లో మూవ్ అయిపోతూ ఉండాలన్నారు. గతం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ లైఫ్‌లో చాలామంది తప్పులు చేస్తున్నారని వేణు చెప్పారు. వడ్డే నవీవ్, నేను, సిమ్రాన్, సునీత భర్త మ్యాంగో రామ్ ముంబైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో క్లాస్ మేట్స్ అని వేణు తెలిపారు.
 
మ్యాంగో రామ్ కూడా కొన్ని సినిమాలు చేశారని ఆయన తెలివైన వాడని వేణు వెల్లడించారు. తన సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసని వేణు తెలిపారు. నేను అందరితో కలివిడిగా ఉండేవాడినని వేణు తెలిపారు. 
 
నవీన్ హలో అంటే హలో అనేవారని వేణు చెప్పుకొచ్చారు. సిమ్రాన్ అసలు పేరు రిషిబాల అని ఆమె చాలా హార్డ్ వర్కర్ అని వేణు కామెంట్లు చేశారు. బి.గోపాల్ గారు నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని వేణు వెల్లడించారు.
 
ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో స్వయంవరం తొలి సినిమా అని వేణు తెలిపారు. చంద్ర సిద్దార్థ్‌ను చందు అని పిలిచేవాడినని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను శ్రీను అని పిలిచేవాడినని ఆయన కామెంట్లు చేశారు.  

అన్నీ చూడండి

ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా గెలిచారు.. బాబుపై జగన్ ఫైర్

ఆదోనీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన రెబల్ ఘన విజయం (Video)

గుంటూరు మేయర్ పీఠంపై నటుడు జగపతిబాబు సోదరి - కుప్పంలో వైకాపాకు సున్నా

ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు ప్రజలకు ఉంటుంది : మద్రాస్ హైకోర్టు

ఇది చూస్తే పవన్ కల్యాణ్‌కి పూనకాలే, ఆదోనిలో జనసేన రెబల్ స్టార్, వీడియో

అన్నీ చూడండి

లవంగాలు ఎలా ఉపయోగపడుతాయో తెలిపే 8 పాయింట్లు

మలబద్ధకం నుంచి ఉపశమనం: కొత్త డల్కోఫ్లెక్స్ లిక్విడ్‌

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?

విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

తర్వాతి కథనం
Show comments