శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (16:02 IST)

ఈసీబీ ప్రతిపాదనను తిరస్కరించిన బీసీసీఐ - పీసీబీ

Bharat-Pakistan
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు తాము ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా వద్ద ఓ ప్రతిపాదన చేసింది. 
 
క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు చివరిగా గత 2007లో టెస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ కారణాల రీత్యా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లకు అవకాశం లేకుండా పోయింది. 2013 నుంచి కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. 
 
అయితే, ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. జట్టు వెంట ఈసీబీ డిప్యూటా ఛైర్మన్ మార్టిన్ డార్లో కూడా ఉన్నారు. ఈయన పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా వద్ద ఓ ప్రతిపాదన చేశారు. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు తటస్థ వేదికగా ఇంగ్లండ్ నిలుస్తుందనే ప్రతిపాదన చేశారు. అయితే, దీనికి రమీజ్ రాజా సమాధానం ఏంటన్నది తెలియాల్సివుంది. 
 
ఈ ప్రతిపాదనను జట్టు కెప్టెన్ మొయిన్ అలీ స్పందించారు. ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక అయితే అది అద్భుతమే అవుతుందని చెప్పారు. క్రికెట్ ప్రపంచంలో రెండు మేటి జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడటం, ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడకపోవడం సిగ్గుచేటని చెప్పుకొచ్చారు. 
 
ఈసీబీ వైస్ ఛైర్మన్ చేసిన ప్రతిపాదనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పందించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగబోదని, అది తటస్థ వేదిక అయినా, మరో వేదిక అయినా సరే సాధ్యపడే విషయం కాదని పేర్కొన్నాయి.