సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (14:13 IST)

యువీ అంటే నాకు పిచ్చి.. టీనేజ్‌లో ప్రేమలో పడ్డాను.. ఐశ్వర్య లక్ష్మి

Aishwarya Lekshmi
Aishwarya Lekshmi
మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి తన టీనేజ్ ప్రేమ గురించి నోరు విప్పింది. ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో కూడా ఐశ్వర్య మెరిసింది. 
 
ప్రస్తుతం ఆమెకు దక్షిణాదిలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాను టీనేజ్‌లో వుండగా టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రేమలో పడ్డానని వెల్లడించింది. 
 
యువీ అంటే తనకు పిచ్చి అని.. తన మనసులోనే ఆయనను ప్రేమించే దానిని అని చెప్పుకొచ్చింది. యువ నటుడు అర్జున్ దాస్‌కు, తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని వార్తల్లో నిజం లేదని ఐశ్వర్య వెల్లడించింది.