శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (17:01 IST)

ప్రభుదేవాతో డాన్స్‌ వేయాలనుంది.. నటి హేమ

హీరోయిన్లు హీరోతోపాటు డాన్స్‌లు వేయడం మామూలే.. వయస్సు మీదపడినా.. అక్క, అమ్మ పాత్రలు వేసే నటి హేమ.. కూడా డాన్స్‌లు వేయాలనే ఆలోచనను వ్యక్తంచేస్తోంది. చిత్ర పరిశ్రమలో ఫైర్‌బ్రాండ్‌గా.. హడావుడి చేసే ఈ నటి

హీరోయిన్లు హీరోతోపాటు డాన్స్‌లు వేయడం మామూలే.. వయస్సు మీదపడినా.. అక్క, అమ్మ పాత్రలు వేసే నటి హేమ.. కూడా డాన్స్‌లు వేయాలనే ఆలోచనను వ్యక్తంచేస్తోంది. చిత్ర పరిశ్రమలో ఫైర్‌బ్రాండ్‌గా.. హడావుడి చేసే ఈ నటి... పలు సినిమాల్లో బ్రహ్మానందం పక్కన జోడిగా నటించింది. 
 
తాజాగా... 'అభినేత్రి' సినిమాలో ప్రభుదేవా తల్లిగా నటించింది. అయితే ఈ పాత్ర గురించి చెబుతూ చిత్ర దర్శకుడు నన్ను చూసి అమ్మ పాత్రకి సూట్‌ కానని అనుకున్నారు. కానీ మూడు పాత్రల్లోనూ నన్ను తీసుకున్నారు. దీనికి కారణం ప్రభుదేవానే. ఆయనతో నేను 'వారసుడు' సినిమాలో నటించాను. నేను డాన్స్‌ బాగా చేస్తాను. ఎప్పటికైనా ప్రభుదేవా కొరియోగ్రఫీలో డ్యాన్సులు చేయాలని కోరికగా ఉందని చెప్పింది.