1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (15:33 IST)

పవన్ కళ్యాణ్ అలాంటివారా? 'ఇస్మార్ట్' బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో అవకాశం దక్కించుకున్న కుర్రకారు హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె తాజాగా పవన్ గురించి సంచలన వ్యాఖ్యాలు చేశారు. సోషల్ మీడియాలో "ఆస్క్ మీ" అంటూ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పింది.
 
ముఖ్యంగా పవన్ చిత్రంలో నటించే అవకాశం దక్కడంపై మే అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ 'పవన్‌తో నటించడం నా అదృష్టం. ఆయన ఒక వన్ మ్యాన్ ఆర్మీ. దేవుడు ఎంతో ప్రత్యేకంగా తయారు చేసిన వ్యక్తి పీకే సర్. ఈ సినిమాలో నటించడం అద్భుతంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.
 
ఈమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహరవీరమల్లు" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే యేడాది ఈ చిత్రం విడుదలకానుంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ యువరాణిగా నటిస్తుంది.