శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (12:33 IST)

టాలీవుడ్‌లో ఐక్యత లేదు నిజమే.. నాని సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో ఐక్యత లేదన్న విషయం చాలా కాలంగా వినబడుతూనే ఉంది. అదే విషయాన్ని హీరో నేచురల్ స్టార్ నాని వెల్లడించారు. ఏపిలో సినిమా టికెట్ల విషయంపై తన అభిప్రాయం చెప్తే మీడియా దాన్ని పెద్దది చేసి చూపించిందనీ నాని ఆరోపించారు. కాకపోతే సమస్య అనేది నిజమని, అది వచ్చినప్పుడు అందరూ ఒకటికావాల్సిన అవసరం ఉందని హీరో నాని పేర్కొన్నారు. 
 
కానీ టాలీవుడ్‍లో అలాంటి పరిస్థితి లేదన్నారు. తాను చెప్పిన మాటలు తప్పు అయితే తనకు ఆనందమేననీ కానీ టాలీవుడ్‌లో మాత్రం యూనిటీ లేదని నాని స్పష్టం చేశారు. తాను ఇండస్ట్రీలో ఎవరినీ అవమానించడానికి ఈ మాటలు అనడం లేదని అన్నారు. 
 
వకీల్ సాబ్ మువీ విడుదల సమయంలోనే ఈ సమస్య మొదలైందనీ, అప్పుడే అందరూ ఒక తాటిపైకి వచ్చి ఏపిలో టికెట్ల రేట్ల సమస్యలపై డీల్ చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కావని నాని అభిప్రాయపడ్డారు.