బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 25 డిశెంబరు 2021 (16:41 IST)

శ్రీశైలం దేవ‌స్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం...

కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం ఆదాయం రికార్డు స్థాయిలో న‌మోదు అయింది. దేవ‌స్థానం హుండీల ఆదాయం 5 కోట్లు చేరింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు చేయ‌గా, భారీ మొత్తంలో హుండీ ఆదాయం లభించిందని ఈవో లవన్న తెలిపారు. 
 
 
గ‌త 30 రోజులలో రూ. 5కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించడం ఇదే మొదటిసారి. హుండీ మొత్తం లెక్కించ‌గా, రూ. 5,02,45,391/-లు లభించాయి. బంగారం 459 గ్రాములు 400 మిల్లీగ్రాములు, వెండి 14 కేజీల 250  గ్రాములు లెక్కించారు. 
 
 
ఇక‌, శ్రీశైలంలోని లలితాంబిక కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపునకు డిప్ నిర్వహిస్తున్న‌ట్లు ఈవో ల‌వ‌న్న తెలిపారు. ఏపీ గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఈ విధానం నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. మరి కొందరు దుకాణాలకు సంబంధించి అధికంగా ఉందని, న్యాయస్థానానికి వెళ్లడంతో ప్రస్తుతం నిలుపుదల చేశారు.