గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (10:25 IST)

రిజ్వాన్ కొత్త రికార్డు: 18 అర్ధ సెంచరీలు.. 2,036 పరుగులు

Mohammad Rizwan
క్యాలెండర్ ఇయర్‌లో రెండు వేల పరుగులు చేసి.. ఈ ఫీట్ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్. కరాచీలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ-20లో ఈ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు రిజ్వాన్. 
 
208 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముందు నుంచీ దూకుడుగానే ఆడిన రిజ్వాన్.. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో ఫోర్‌తో ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది 45 ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్.. 55 సగటు, 130 స్ట్రైక్ రేట్‌తో 2,036 పరుగులు సాధించాడు. అందులో 18 అర్ధ సెంచరీలున్నాయి. 
 
కాగా, ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ పేరు మీదున్న (1,779) రికార్డును ఇప్పటికే రిజ్వాన్ చెరిపేశాడు. బాబర్ రెండో స్థానంలో ఉన్నాడు.