శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 నవంబరు 2021 (14:27 IST)

ఆసీస్ చేతిలో చివరి ఓవర్లలో చిత్తైన పాకిస్తాన్, డ్రెస్సింగ్ రూంలో పాక్ కెప్టెన్ బాబర్ ఏం చేశాడో చూడండి

చివరి దాకా తామే గెలుస్తామన్న ధీమాతో ముందుకు సాగిన పాకిస్తాన్ జట్టుకు టి-20 సెమీఫైనల్లో భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. ఆ షాక్ దెబ్బకి పాకిస్తాన్ దేశంలో చాలామంది క్రీడాభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా షేర్ అవుతున్నాయి.

 
ఇదిలావుంటే ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడాక పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూములోకి వెళ్లింది. అక్కడ అంతా మౌనముద్రలో మునిగిపోయారు. అలా చేసి వుంటే గెలిచేవాళ్లం, ఇలా చేసి వుంటే గెలిచేవాళ్లం అనే చర్చ మామూలే. ఇలాంటి చర్చలను ఇక చేయవద్దని కెప్టెన్ బాబర్ జట్టు సభ్యులతో చెప్పాడు. జట్టును ఉత్సాహపరుస్తూ మాట్లాడాడు.

 
జరగాల్సింది జరిగిపోయింది, కనుక ఈ ఓటమి గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఈ ఓటమికి ఎవరినీ నిందించాల్సిన అవసరంలేదు, ఎంతో కష్టపడి అద్భుత టీంను నిర్మించామనీ, ఈ ఓటమిని త్వరగా మర్చిపోవాలని జట్టు సభ్యులకు తెలిపాడు. ఈ పరాజయం గురించి ఇంకా ఎవరైనా చర్చిస్తూ కూర్చుంటే మాత్రం తన వైఖరి వేరేగా వుంటుందని జట్టు సభ్యులతో అన్న మాటలను పిసిబి ట్విట్టర్లో పోస్ట్ చేసింది.