సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (11:37 IST)

వైరల్.. ఇమ్రాన్ ఖాన్-రేఖల లవ్ స్టోరీ.. పెళ్లికి కూడా సిద్ధమయ్యారట..!

Imran khan_Rekha
బాలీవుడ్ హీరోయిన్ రేఖ, పాక్‌ మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వెలుగులో వచ్చింది.క్రికెట్ ఆడిన గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న ఇమ్రాన్ ఖాన్ 1992 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టును విజయానికి నడిపించాడు. అతను ఆడే రోజుల్లో భారతీయులతో సహా చాలా మంది అందమైన మహిళలతో ఎప్పుడూ చుట్టుముట్టారు.
 
గతంలో, పాకిస్తాన్, భారతదేశం క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సిరీస్ ఆడేవి. ఆ సమయంలో బాలీవుడ్, క్రికెటర్ల మధ్య పరస్పర సంబంధాలు బాగుండేవి. క్రికెటర్లకు.. బాలీవుడ్ హీరొయిన్స్‌కు ఎప్పటి నుంచో ర్యాంపో నడుస్తుండడం చూస్తునే ఉన్నాం. కోహ్లీ - అనుష్క, గీతా బాస్రా - హర్భజన్ సింగ్,యువరాజ్ - హాజెల్ కీచ్,సాగారికా ఘాట్గే - జహీర్ ఖాన్ ఇలా చాలా మంది టీమ్‌ఇండియా క్రికెటర్లను ప్రేమించారు. పెళ్లి చేసుకున్నారు.
 
అలాగే ఇమ్రాన్ ఖాన్, బాలీవుడ్ స్టార్ నటి రేఖల మధ్య అప్పట్లో ప్రేమ వ్యవహారం నడిచేదని టాక్ వస్తోంది. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మాజీ క్రికెటర్‌, సీనియర్ నటి రేఖలకు సంబంధించిన పాత కథనం మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ దాదాపు బాలీవుడ్ దివా రేఖతో వివాహం చేసుకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ గురించి గతంలో వచ్చిన ఒక నివేదిక పేర్కొంది. రేఖ-ఇమ్రాన్ ఖాన్‌ల మధ్య వివాహం జరిగిపోయిందని.. వీరు నెల పాటు సంసారం చేశారని.. బీచ్‌ల చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేశారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయి కూర్చున్నాయి.  
 
వీరిద్దరూ చాలా దగ్గరగా ఉన్నట్లు మరియు 'వారు ఒకరినొకరు లోతుగా మరియు ఉద్రేకంతో ప్రేమిస్తున్నారని' చాలా మంది ఈ జంటను కలిసి చూశారట. వీరిద్దరూ దాదాపు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. 
 
ఇకపోతే.. సినీతారలతో డేటింగ్ గురించి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయం ఏమిటో కూడా ప్రచురించారు. నటీమణులతో సహచర్యం కొన్నాళ్లే బాగుంటుందన్నారు. 
 
కొంత వరకు వారితో సాంగత్యాన్ని నేను ఆస్వాదించేవాడినని.. ఆ తర్వాత ముందుకెళ్లే వాడినని చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే నటిని పెళ్లి చేసుకోవాలని మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదని ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడం గమనార్హం.