మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 10 మే 2021 (18:39 IST)

క‌రోనాపై కంగ‌నా కామెంట్ వైర‌ల్‌, ఆమె ఇన్‌స్టాగ్రాం పోస్ట్ డిలిట్

kangana commet
కొద్దిరోజుల క్రితం త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలియ‌జేస్తూ శివుడి విగ్ర‌హం వెనుక ధ్యానం చేస్తున్న ఫొటోను పెట్టి క‌రోనాను జ‌యిస్తాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. కరోనా తన శరీరంలో పార్ట్ చేసుకుందని, కోవిడ్ ఒక చిన్న ఫ్లూ మాత్రమేనని, దాన్ని త్వరలోనే అంతం చేస్తానని పిక్‌ను షేర్ చేసింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు కంగ‌నా వివాదాస్ప‌ద‌రాలుగా పేరుపొందిన విష‌యం తెలిసిందే. చిన్న ఫ్లూ అని చెప్ప‌డంతో దానికి చాలా మంది హ‌ర్ట్ అయ్యారు. ఇది పెద్ద వైర‌ల్ అయింది.
 
దీనికి ఆమె వెంట‌నే స్పందించింది.  'నేను కోవిడ్‌ను నాశనం చేస్తానని పోస్ట్ చేయడంతో కొందరు హర్ట్ అయ్యారట. ఇప్పటివరకూ టెర్రరిస్టులకు మద్దతుదారులు ఉంటారని ట్విట్టర్లో విన్నాను. కానీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లోనూ క‌రోనాకు ఫ్యాన్ క్లబ్ ఉంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌కు వచ్చి కొన్ని రోజులే అవుతోంది. కానీ ఇక్కడ ఇంకో వారానికి మించి ఉంటానని అనుకోవడం లేదు' అంటూ పోస్ట్ చేసింది.
 
kanaga commet
గ‌త కొద్దిరోజులుగా ఏదోర‌కంగా వార్త‌ల్లో వుంటూనే వుంది. ఢిల్లీలో రైతుల ధ‌ర్నాకు స‌పోర్ట్‌గా మొద‌ట కామెంట్ చేసి, ఆ త‌ర్వాత మాట‌మార్చి కేంద‌ప్ర‌భుత్వానికి వ‌త్తాసుప‌లికింది. ఆ త‌ర్వాత దేశంలో జ‌రిగిన ప్ర‌తివిష‌యాన్ని ట్వీట్ చేస్తుంది. దీంతో కొద్దీ రోజుల క్రితం హింసను ప్రేరేపించే ట్వీట్లు చేసిందంటూ ఆమె ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ర‌క‌ర‌కాల పేర్ల‌తో ఇన్‌స్ట్రాగ్రామ్‌లోనూ యాక్టివ్‌గా వుంది. మ‌రి ఇది కూడా పోతే త‌న స్పంద‌న ఎలా తెలియజేస్తుందో చూడాలి.