మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 8 మే 2021 (11:20 IST)

నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, రండి దీన్ని నాశనం చేద్దాం: కంగనా రనౌత్

కరోనావైరస్ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను పట్టుకున్నది. కొందరు దాన్నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మరికొందరు దానికి బలయ్యారు. ఐతే కరోనా సెకండ్ వేవ్ తన తీవ్ర రూపాన్ని చూపుతోంది. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యిందని తెలిపింది.
 
ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ.. గత కొన్ని రోజులుగా నా కళ్ళలో కొంచెం మంటతో నేను అలసిపోయాను. బలహీనంగా ఉన్నాను, హిమాచల్ వెళ్ళాలని ఆశిస్తున్నాను కాబట్టి నిన్న నా పరీక్ష పూర్తయింది. ఈ రోజు ఫలితం వచ్చింది. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.
 
నేను ప్రస్తుతం హోం క్వారెంటైన్లో వున్నాను. ఈ వైరస్ నా శరీరంలో ఒక భాగం అయి వుందని నాకు తెలియదు, ఇప్పుడు నేను దానిని పడగొడతానని నాకు తెలుసు. ప్రజలారా...  దయచేసి దానికి మీరు ఎలాంటి శక్తిని ఇవ్వకండి, మీరు భయపడితే అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది.

రండి ఈ కోవిడ్ -19 ను నాశనం చేద్దాం, ఇది ఒక చిన్న టైమ్ ఫ్లూ తప్ప మరేమీ కాదు, ఇది చాలా ఎక్కువ ప్రెస్ చేస్తుంది. మనస్తత్వాన్ని బట్టి ఇది ఆడుకుంటుంది. మనం బలంగా వుంటే ఇదేమీ చేయలేదు. హరహర మహాదేవ్.. అంటూ పేర్కొంది.