శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (19:47 IST)

మోడీ విశ్వరూపం చూపించి మమతను ఓ ఆటాడించాలి... షాకిచ్చిన ట్విట్టర్

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు మరో సమస్యను ఎదుర్కొన్నారు. ఆమె ట్విటర్ ఖాతాను శాశ్వతంగా క్లోజ్ చేస్తూ ట్విట్టర్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ఫ‌లితాల సంద‌ర్భంగా కంగ‌న అభ్యంత‌రక‌ర ట్వీట్లు చేయ‌డం వ‌ల్లే ఆమె అకౌంట్‌ను స‌స్పెండ్ చేసింది. 
 
బెంగాల్‌లో జరిగిన హింసపై కంగనా చేసిన ట్వీట్.. ట్విట‌ర్ మార్గ‌దర్శ‌కాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై కంగ‌నా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమెను ఓ రాక్ష‌సిగా అభివ‌ర్ణించారు.
 
అంతేకాకుండా, ప‌శ్చిమ బెంగాల్‌లో వెంట‌నే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేసింది. అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్క‌డ హింస చెల‌రేగ‌లేద‌ని, ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం టీఎంసీ హింస‌కు దిగుతోంద‌ని కంగ‌నా ట్వీట్ చేసింది. 
 
బెంగాల్ మంట‌ల్లో కాలిపోతోందంటూ కంగ‌నా ట్వీట్ చేయ‌డంపై ట్విట‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. త‌న ట్వీట్ల‌లో ఇందిరా గాంధీపై కూడా ఆమె ప‌లు కామెంట్లు చేసింది
 
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ట్విటర్ ఖాతా నిలిచిపోయింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం చోటు చేసుకున్న హింసపై కంగనా చేసిన వ్యాఖ్యలు తమ నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ట్విట్టర్ స్పష్టం చేసింది. 
 
ప్రధాని నరేంద్ర మోడీ తన పాత విశ్వరూపాన్ని ప్రదర్శించి మమతా బెనర్జీని ఓ ఆటాడించాలని కంగనా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కొరడా ఝుళిపించింది.
 
కాగా, ట్విట్టర్ తన ఖాతాను తొలగించడంపై కంగనా స్పందించారు. తన గళాన్ని వినిపించడానికి అనేక వేదికలు ఉన్నాయని అన్నారు. తాను స్వయంగా సినీ నటినని, సినిమాల ద్వారా కూడా తన అభిప్రాయాలను వెల్లడించగలనని స్పష్టం చేశారు.