గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (10:46 IST)

మోడీ - షా ద్వయానికి చుక్కలు చూపిన దీదీ.. విపక్షాలకు ఆశాకిరణం?

దేశంలో తమకెదురులేదనీ కాలరెగరేస్తూ వచ్చిన నరేంద్ర మోడీ - అమిత్ షా ద్వయానికి ఓ మహిళ పట్టపగలు చుక్కలు చూపించింది. ఆమె ఎవరో కాదు.. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి. ఇపుడు ఈమె మోడీ - షా ద్వయానికి కంట్లో నలుసుగా మారగా, దేశంలోని విపక్ష పార్టీలన్నింటికీ ఓ ఆశాకిరణంగా మారారు. 
 
ఆదివారం వెలువడిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ పార్టీ విజయభేరీ మోగించారు. దీంతో ఆమె ఇపుడు ప్ర‌తిప‌క్షాల‌కు ఆశాకిర‌ణంగా క‌నిపిస్తున్నారు. ఒక‌ప్పుడు బెంగాల్‌లో క‌మ్యూనిస్ట్ కోట‌ను బ‌ద్ద‌లుకొట్టిన ఆమె.. ఇప్పుడు త‌మ‌కు తిరుగే లేద‌ని కాల‌రెగరేస్తున్న మోడీ, అమిత్ షా జోడీకి చుక్క‌లు చూపించారు. 
 
వీళ్లు అజేయులేమీ కాద‌ని నిరూపించారు. 2016 కంటే కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచి ముచ్చ‌ట‌గా మూడోసారి అధికార పీఠం ఎక్క‌బోతున్నారు. పైగా, నందిగ్రామ్ ఓట‌మిని ఆమె లైట్ తీసుకున్నారు.
 
ఈ విజ‌యం ఆమెను సోష‌ల్ మీడియాలోనూ స్టార్‌ను చేసింది. ఎన్నిక‌ల ఫలితాలు వ‌చ్చిన రోజున ఆమె గెలుపు దాదాపు ఖాయ‌మైన త‌ర్వాత 1980నాటి మ‌మ‌త ఫొటో ఒక‌టి తెగ వైర‌ల్ అవుతోంది. ట్విట‌ర్‌లో ఇండియ‌న్‌హిస్ట‌రీపిక్స్ అనే హ్యాండిల్ ఈ ఫొటోను పోస్ట్ చేసింది. 
 
అప్ప‌టి నుంచి ఆమెను ఆకాశానికెత్తుతూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందిరా గాంధీ త‌ర్వాత భార‌త రాజ‌కీయాల‌ను శాసించిన మ‌హిళ మ‌మ‌త‌నే అని ఒక‌రు కామెంట్ చేశారు. భార‌త రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఆమెకు ప్ర‌త్యేకంగా ఒక పేజీ ఉంటుంద‌ని మరొక‌రు అన్నారు.