మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (20:25 IST)

ఆ టీమ్‌లో భారత్ నుంచి ఒక్కరికి కూడా నో ప్లేస్

టీ20 ప్రపంచకప్ ముగియడంతో ఈ టోర్నీలో మోస్ట్ వాల్యుబుల్ ఆటగాళ్లతో కూడిన జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ టీమ్‌లో భారత్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. మొత్తం ఆరు జట్ల ఆటగాళ్లను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. ఈ జట్టుకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను సారథిగా ఐసీసీ పేర్కొంది. 
 
ఐసీసీ ప్రకటించిన టీమ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లు, శ్రీలంక నుంచి ఇద్దరు ఆటగాళ్లు, న్యూజిలాండ్‌ నుంచి ఒక ఆటగాడు, పాకిస్థాన్‌కు చెందిన ఒక ఆటగాడు ఉన్నారు. కనీసం 12వ ఆటగాడిగానూ టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కలేదు. 12వ ఆటగాడిగా పాకిస్థాన్‌కు చెందిన షహీన్ షా అఫ్రిదిని ఐసీసీ ఎంపిక చేసింది.