మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (20:32 IST)

సిగరెట్ తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశా- కృతి శెట్టి ఇంటర్వ్యూ

Kriti Shetty
ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. ట్రెడిషన్, కల్చర్ గురించి తెలియాలి. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను అని కృతి శెట్టి తెలిపింది. శ్యామ్ సింగ రాయ్ లో న‌టించిన ఆమె త‌న అనుభ‌వాల‌ను ఇలా తెలియ‌జేసింది.

 
నాకు వచ్చే పాత్రలపై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా ఉంటుంది.. ఆమె అలవాట్లు ఏంటి? ఆమె ఎలాంటి పాటలు వింటుంది అని నేనే సపరేట్‌గా రాసుకుంటాను. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కీర్తి పాత్రకు తల్లి ఉండదు. తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అప్పుడు కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని దర్శకుడికి చెప్పాను.

 
నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే చాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి.

 
నాని గారితో నటించడం అంటే మొదట్లో నాకు భయం వేసింది. కానీ ఆయన సెట్‌లొ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన వరకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరి పర్ఫామెన్స్ చూస్తారు. బాగుందని అంటారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత కంఫర్ట్‌గా నటించగలిగాను.

 
బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాను. ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు.

 
నా ఫ్యామిలీ అంతా ఒక్కో చోట ఉంటారు. సినిమా టికెట్లను నాకు చూపించారు. సినిమాకు వెళ్తున్నామని చెప్పారు. మా నాన్న సినిమాను చూసి నన్ను మెచ్చుకున్నారు. బాగా చేశావ్ అని అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా సెట్‌లోకి రారు. నా లుక్ గురించి తెలీదు. కొత్తగా, ఫ్రెష్‌గా ఉందని అన్నారు.

 
ఉప్పెన సినిమాలో నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. కానీ ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే చాన్స్ వచ్చింది. ఉప్పెన తరువాత నాకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. కానీ మళ్లీ మళ్లీ అలాంటి పాత్రనే ప్రేక్షకులకు ఎందుకు చూపించాలి. కావాలంటే వారు నెట్ ఫ్లిక్స్‌లో ఉప్పెన చూస్తారు. కొత్తగా ఉంటుందనే ఈ పాత్రను ఎంచుకున్నాను. భిన్న పాత్రలను చేయాలని నాకు ఉంటుంది.

 
స్టోరీ కంటే నా పాత్ర ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తాను. ఇంటర్వెల్ వరకు ఉంటుందా? తరువాత ఉండదా? అని ఆలోచించను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉందా? లేదా? అని అనుకుంటాను. రకరకాల పాత్రలను చేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కామెడీ పాత్రలను చేస్తే ఆ టైమింగ్ తెలుస్తుంది. అందుకే విభిన్న పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను.

 
సాయి పల్లవి పాత్ర నాకు చాలా నచ్చింది. నేను కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఆమె స్క్రీన్ మీద చాలా బాగా చేశారనిపించింది. నేను సెట్‌లో సాయి పల్లవిని కలవలేదు. ఓ సారి సెట్‌కు వెళ్లాను గానీ ఆ రోజు సాయి పల్లవి షూటింగ్ లేదు.

 
నానిని అందరూ నాచురల్ స్టార్ అంటారు. ఆయన ఏ పాత్రను చేసినా ఆ పాత్రలోకి వెళ్లిపోతారు. ఆ కారెక్టర్‌ను అంత న్యాచురల్‌గా చేస్తారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని రెండు పాత్రల్లోనూ వేరియేషన్ ఉంటుంది. నాకు వాసు అంటేనే ఇష్టం. మిడిల్ క్లాస్ అబ్బాయి, నిన్ను కోరి సినిమాల్లోని నాని అంటే ఇష్టం.

 
నాకు యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి ఆఫర్లు వస్తే యాక్షన్స్ సీక్వెన్స్‌ల్లో శిక్షణ తీసుకుంటాను. నేను ఇంత వరకు డ్యాన్స్‌లే చేశాను. అలాంటి యాక్షన్ సినిమాల్లో చేస్తే చాలెంజింగ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓటీటీ ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తాను.

 
ఉప్పెన విడుదల కాక ముందే ఆఫర్లు వచ్చాయి. నా మీద నమ్మకం పెట్టుకుని ఆఫర్లు ఇస్తున్నారని ఆనందంగా అనిపించింది. నెరేషన్ ఇచ్చేటప్పుడు ఆడియెన్స్ కోణంలోనే వింటాను. నేను మా అమ్మ కలిసే కథను వింటాం. ఓకే చేస్తాం. నాకు ఆ పాత్ర సెట్ అవుతుందని అనిపిస్తేనే ఓకే చెబుతాను.

 
బంగార్రాజు షూటింగ్ నిన్ననే పూర్తయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫిబ్రవరిలో వస్తుందేమో. మాచర్ల నియోజకవర్గం ఏప్రిలో‌లో వస్తుంది. రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి ఇంకా ఆఫర్లు రాలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు ఇక్కడే ఇంత ప్రేమ దొరుకుతోంది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది.