బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (10:20 IST)

క్యాస్టింగ్ కౌచ్: ఆ 14మంది నన్ను అలా వేధించారు.. మలయాళ నటి

Revathi
క్యాస్టింగ్ కౌచ్ వివాదం మాలీవుడ్‌లో కలకలం రేపింది. ముఖ్యంగా మహిళలు సినీ ఇండస్ట్రీలోకి రావాలంలో కొంతమంది తమకు పడక సుఖం ఇస్తేనే ఛాన్సులు ఉంటాయని దారుణంగా వాడుకుంటున్నారని బాధిత నటీమణులు ఆరోపిస్తున్నారు. అవకాశాల పేరుతో అమ్మాయిల పడక సుఖం కోరుకునే కామాంధులు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. 
 
తాజాగా మలయాళ నటి, సోషల్ యాక్టివిస్ట్ రేవతి తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బయటపెట్టింది. తనని శారీరకంగా, మానసికంగా, అసభ్య పదజాలంతో వేధించిన 14 మంది పేర్లను ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌ వేదికగా బయటపెట్టింది. ఈ జాబితాలో నన్ను లైంగికంగా, మానసికంగా.. మాటలతో వేధించిన వ్యక్తులు ఉన్నారు. ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను 'అని తెలిపారు.
 
రేవతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పేర్లు :
1) రాజేష్ టచ్‌రైవర్ (డైరెక్టర్)
2) సిద్దిక్ (నటుడు)
3) ఆశిక్ మాహి (ఫోటోగ్రాఫర్)
4) షిజు (నటుడు)
 
5) అభిల్ దేవ్ (కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడు)
6) అజయ్ ప్రభాకర్ (డాక్టర్)
7) ఎంఎస్ పధుష్ (దుర్వినియోగదారుడు)
 
8) సౌరభ్ కృష్ణన్ (సైబర్ బల్లీ)
9) నందు అశోకన్ (డివైఎఫ్ఐ యూనిట్ కమిటీ సభ్యుడు, నేదుంకర్)
10) మాక్స్వెల్ జోస్ (షార్ట్‌ ఫిల్మ్‌ దర్శకుడు)
11) షానూబ్ కరవత్ (యాడ్ డైరెక్టర్)
 
12) రాగేంద్ పై (కాస్ట్ మి పర్ఫెక్ట్, క్యాస్టింగ్ డైరెక్టర్)
13) సారున్ లియో (ఈఎస్ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్, వాలియతురా)
14) బిను (సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పూంతురా పోలీస్ స్టేషన్, తిరువనంతపురం)