గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 జూన్ 2021 (15:28 IST)

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్: అర్థరాత్రి బోయ్‌ఫ్రెండుతో జోగుతూ వుంది

డ్రగ్స్... సినీ ఇండస్ట్రీని వెంటాడుతూనే వుంటుంది. ఈ ఉచ్చులో చాలామంది ఇరుక్కోవడం మనకు తెలిసిన విషయమే. ఇక అసలు విషయానికి వస్తే... ‘బుర్ర కథ’ చిత్రంలో నటించిన నైరా షా డ్రగ్స్ ఉచ్చులో ఇరుక్కుంది. తాజా సమాచారం ప్రకారం, నిషేధిత పదార్థాలను వినియోగించిందనే ఆరోపణలపై నైరా షాను ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో -ఎన్‌సిబి అరెస్టు చేసింది. బుర్ర కథ నటిని ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినప్పటికీ ఆ వార్త ఆలస్యంగా వచ్చింది.
 
ముంబైలోని జుహులోని ఒక హోటల్ నుండి జూన్ 13న ఆమెతో పాటు ఆమె స్నేహితుడు ఆశిక్ సాజిద్ హుస్సేన్‌ను ఎన్‌సిబి అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల వినియోగంపై దర్యాప్తులో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హోటల్ గదిని శోధించింది. అన్వేషణలో, సిగరెట్లలోకి చుట్టబడిన ఒక గ్రాము మాదకద్రవ్యం ఎన్‌సిబి స్వాధీనం చేసుకుంది.
 
తెల్లవారుజామున 3 గంటలకు గదిపై దాడి జరిగిందని, నైరా షా, ఆశిక్ సాజిద్ మత్తులో జోగుతున్నారనీ అధికార వర్గాలు వెల్లడించాయి. నైరా షా తన పుట్టినరోజు వేడుకను హోటల్‌లో జరుపుకుంది. ఈ సందర్భంగా తన బోయ్ ఫ్రెండుతో ఆమె మత్తులో జోగినట్లు సమాచారం.