గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (09:58 IST)

సమంత భావోద్వేగ ట్వీట్.. మమ్మీ.. నీ వెన్ను దొరికింది...

samantha
samantha
టాలీవుడ్ నటి సమంత లేటెస్ట్ పోస్ట్ అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. సమంతకు ఆమె ఫాలోవర్స్ తమ హృదయపూర్వక మద్దతును తెలియజేస్తున్నారు. సమంత మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. 
 
గత కొన్ని రోజులుగా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొన్ని ఎమోషనల్ పోస్ట్‌లను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటోంది. కొన్ని గంటల క్రితం సోఫాలో పడుకుని ఉన్న ఫోటోను షేర్ చేసిన ఈ నటి, ఆమె వెనుక తన పెంపుడు కుక్కలు కనిపించాయి. 
 
'కంగారు పడకండి మమ్మీ.. నీ వెన్ను దొరికింది... #chroniclesofbeingcute #hashandsaasha." అంటూ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇక కెరీర్ పరంగా సమంత శాకుంతలం సినిమాతో సినీ ప్రియులను అలరించబోతోంది.