బుధవారం, 29 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: సోమవారం, 14 నవంబరు 2022 (16:01 IST)

సమంత యశోద బీటీఎస్ విడుదల.. యాక్షన్ అదిరింది.. (వీడియో)

Samantha,Yannick Benn
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన "యశోద" సినిమా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో సమంత నటన సినిమాకే హైలైట్‌గా నిలిచిందని, ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించడంలో సమంత కీలక పాత్ర పోషించిందనే టాక్ వస్తోంది. 
 
ఇటీవల, సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకుంది. ఈ బీటీఎస్ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సినిమా కోసం చాలా కష్టపడటం చూడవచ్చు. ఈ సినిమాకు సమంత ఫైటింగ్ సీన్స్ హైలైట్‌గా నిలిచింది.
 
సమంత తన పాత్రకు న్యాయం చేయడానికి కఠినమైన శిక్షణ పొందింది. ఈ చిత్రంలో సమంత పోషించే సున్నితమైన ఇంకా భయంకరమైన పాత్రలో ఆమె ప్రయత్నం బాగా చిత్రీకరించబడింది. 
 
ది ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత రాజి పాత్రలో విభిన్న యాక్షన్ రోల్‌లో కనిపించింది. యశోదలోనూ సమంత యాక్టివ్ రోల్‌ ఆమెను ఒక మెట్టు పైకి తీసుకెళ్లింది.