సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (15:09 IST)

కృష్ణం రాజు మృతి.. ఎమోషనల్ వీడియో రిలీజ్

krishnam raju
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ తన కుటుంబానికి అండగా ఉండి తన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. 
 
ఇకపోతే కృష్ణంరాజుకు కొడుకులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడు ప్రభాస్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ప్రభాస్ ఎదుగుదలకు ఎంతగానో ప్రోత్సహించారు.
 
ఈ క్రమంలోనే తనని ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబెట్టిన తన పెదనాన్న చనిపోవడంతో వారసుడిగా కృష్ణంరాజుకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ ప్రభాస్ దగ్గరుండి చేశారు. 
 
ఇక తన పెదనాన్నకు సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిని పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం తన సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తన పెదనాన్న మరణం తర్వాత మొదటిసారి ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.
 
ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కృష్ణంరాజు నటించిన ఇద్దరు సినిమాలలో కొన్ని సన్నివేశాలను తీసుకొని ఒక వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ కృష్ణంరాజు ఇద్దరూ కూడా ఒకే విధమైన షార్ట్ క్రియేట్ చేస్తూ ఈ వీడియో షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఇకపోతే ఇదే వీడియోని ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ హార్ట్ సింబల్‌తో పాటు చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి ఎమోజీలను షేర్ చేస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.