సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (12:50 IST)

ప్రభాస్ "సలార్‌"కు తప్పని లీకుల బెడద

Prabhas
హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం "సలార్". వచ్చే యేడాది విడుదలకానున్న ఈ చిత్రానికి లీకుల బెడద తప్పడం లేదు. ఈ చిత్రం సెట్స్‌లో వీడియో, ఫోటోలు తాజాగా లీక్ అయ్యాయి. ఒక ఫోటోలో ప్రభాస్, మరో ఫోటోలో హాస్య నటుడు శీనుతో కలిసి కనిపిస్తారు. ఇక వీడియోలో షూటింగ్ లొకేషన్‌లో ప్రభాస్ నడుస్తూ కన్పించాడు. 
 
ఆ వీడియో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మేకర్స్ ఓ మాస్ సాంగ్‌ను షూట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, అందుకోసం సన్నాహాలు మొదలు పెట్టారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 'సలార్' కన్నడ, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయనున్నారు. 
 
ఈ చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలో శృతి హాసన్ అరంగేట్రం చేస్తుంది. దీనిని హోంబలే ఫిల్మ్స్ బ్యానరుపై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్నారు. జనవరి 14, 2023న ఈ మూవీ భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది.