1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (22:31 IST)

అల్జీమర్స్‌ను తగ్గించే అత్తిపండు (video)

ఎండిన లేదా తాజాగా ఉన్న అత్తి పండ్లు ఒక సహజ విరేచనాల మందుగా పనిచేస్తాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉండుటం వల్ల ఆరోగ్యకరమైన ప్రేగు కదలికల పని తీరును ప్రోత్సహిస్తుంది. ప్రతి మూడు గ్రాముల పండులో ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది. అత్తి పండ్లను తీసుకోవడం వలన మలబద్ధకంను చాలా బాగా నిరోధిస్తుంది.
 
అత్తి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్- ఫైబర్ సంబంధిత ఆహారాలు వుండటం వల్ల బరువు తగ్గించటంలో సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది. అత్తి పండులో పీచు పదార్థం కలిగిన అద్భుతమైన మూలం ఉంటుంది. దీనిని బరువు తగ్గించుకోవటానికి సమర్థవంతమైన ఆహారంగా చెప్పవచ్చు.
 
అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా వుంది. పెక్టిన్ అని పిలిచే కరిగే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. శరీరం నుండి వ్యర్థ కొలెస్ట్రాల్ బయటకు పంపుతుంది. కాబట్టి ఒక సాధారణ ఆహారంలో అత్తి పండ్లను తీసుకోవటం వలన మీకు అన్ని సాధారణ మార్గాల్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది.
 
అత్తిపండ్లలో ఫైబర్, రాగి, జింక్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో వున్నాయి. కనుక ఇవి జ్ఞాపకశక్తికి దోహదం చేస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి. అల్జీమర్స్ సమస్యను తగ్గిస్తాయి.