సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (19:51 IST)

గాడ్ ఫాదర్ నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది.. దసరా కానుకగా సినిమా (video)

God Father
God Father
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా విజయదశమి రోజున విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 
 
ఈ పాటకు తమన్ సంగీతం అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఇప్పటికే విడుద‌లైన థార్ మార్ థ‌క్కర్ మార్, న‌జ‌భ‌జ జ‌జ‌ర పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. 
 
తాజాగా టైటిల్ సాంగ్ కూడా రావడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్‌, స‌త్యదేవ్‌, న‌య‌న‌తార కీ రోల్స్ పోషిస్తున్నారు.