సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 28 జనవరి 2022 (20:09 IST)

జంతు ప్రవాహ వ్యాయామం చేస్తున్న నటి సంజనా

నటి సంజనా గల్రానీ గురించి తెలియని వారుండరు. ఆమె దక్షిణాది తార. ఆమెకి ఫిట్నెస్ పైన శ్రద్ధ ఎంతటిదంటే... యోగాలో వున్న నైపుణ్యాలను తెలుసుకుంటూనే వుంటానని చెప్తుంది.

 
ఆమె గత కొంతకాలంగా జంతు ప్రవాహ వ్యాయామాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె యోగాతో చాలా సారూప్యతలను కనుగొన్నట్లు చెప్పారు. ఆమె చేసే యోగా భంగిమను ఏనుగు భంగిమ అని పిలుస్తారు.

 
ఈ యోగాలో ఏనుగు తొండాన్ని పైకి కిందికి ఎలా కదిలిస్తుందో అలాగే ఆమె తన మెడను పైకి క్రిందికి కదిలిస్తారు. ఇలా చేయడం వల్ల మెడ నొప్పి సమస్య తగ్గడమే కాకుండా మెడ కండరాలు పట్టేయకుండా వుంటాయి.