గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (17:28 IST)

ఈ షో చేయ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నా - శిల్పాశెట్టి

Shilpa Shetty
నటి శిల్పాశెట్టి రియాల్టీ షో సహాయంతో దేశవ్యాప్తంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంపై సంతోషం వ్యక్తం చేసింది. అస‌లు ఇలాంటి షోలు చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. మ‌రోవైపు గ‌ర్వంగా కూడా వుందని సోష‌ల్ మీడియాలో పేర్కొంది. ప్రస్తుతం 'ఇండియాస్ గాట్ టాలెంట్'పై జడ్జిగా కనిపిస్తున్న ఆమె మాట్టాడుతూ,  "భారతదేశంలో న‌ల‌మూల‌ల‌ దాగి ఉన్న ప్రతిభను వెలికితీసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ సీజన్‌లో 'ఇండియాస్ గాట్ టాలెంట్'ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని చూడటం కూడా హృదయపూర్వకంగా ఉంది. కిర్రోంజీ, బాద్‌షా, మనోజ్, నేను షో షూటింగ్‌లో చాలా కాలం గడుపుతున్నాం అని తెలిపారు.  శిల్పా రియాల్టీ షోకి న్యాయనిర్ణేతగా కనిపించడం ఇది నాలుగోసారి. గతంలో శిల్ప‌ 'జరా నచ్కే దిఖా', 'నాచ్ బలియే, 'సూపర్ డాన్సర్' వంటి షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.
 
'ఇండియాస్ గాట్ టాలెంట్' సీజన్ 9 సోనీ టీవీలో ప్రసారం అవుతుంది. ఇక సినిమాప‌రంగా చెప్పాలంటే శిల్పా 'నీకమ్మ` అనే చిత్రంలో న‌టిస్తోంది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిమన్యు దాసాని, షిర్లీ సెటియా కూడా నటించారు. 2020లో విడుద‌ల‌కావాల్సిన సినిమా క‌రోనావ‌ల్ల వాయిదా ప‌డింది.