సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (18:40 IST)

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై మరో కేసు

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై మరో కేసు నమోదైంది. అడల్ట్ కంటెంట్ కేసులో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేయగా, ఆ తర్వాత ఆయన బెయిలుపై విడదలయ్యారు. తాజాగా ఈ జంటపై ఓ వ్యక్తి 1.51 కోట్ల చీటింగ్ కేసు పెట్టాడు. 
 
ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. వీళ్ళిద్దరితో పాటు ఫ్యాషన్ టీవీ ఎండీ కషీఫ్ ఖాన్‌పై కూడా పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
 
ఫిట్‌నెస్ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమని కాషీఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాతో పాటు పలువురు తనను అడిగారని, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారని ఆ యువకుడు ఫిర్యాదులో తెలిపాడు. 
 
కానీ అందులో తనకు ఎలాంటి లాభాలు రాకపోవడంతో తన డబ్బు రూ.1.51 కోట్లు ఇచ్చేయాలంటూ అడిగితే బెదిరించారని చెప్పాడు. దీంతో యష్ బరాయ్ పోలీసులను ఆశ్రయించాడు. వీళ్లిద్దరి పై ఇలా చీటింగ్ కేసు బుక్ అవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.