శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:37 IST)

మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించాం.. రాజ్‌కుంద్రా కేసులో పోలీసులు

Raj Kundra
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా గురించి ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కొన్ని విషయాలు బయటపెట్టారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రెండు నెలలపాటు పోలీసుల కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాకు సోమవారం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 
 
ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా కేసుపై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు స్పందించారు. విచారణలో భాగంగా రాజ్‌కుంద్రా ఫోన్‌, లాప్‌టాప్‌, హాట్‌డ్రైవ్‌ డిస్క్‌లను పరిశీలించామని.. వాటిల్లో మొత్తం 119 నీలిచిత్రాలు గుర్తించామని పోలీసులు తాజాగా వెల్లడించారు.
 
ఆ వీడియోలన్నింటినీ కుంద్రా రూ.9 కోట్లకు బేరం పెట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబయి శివారులోని 'మాద్‌ దీవి'లోని ఓ బంగ్లాలో పోర్న్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. 
 
దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి 'పోర్న్ రాకెట్‌' గుట్టుని బయటపెట్టారు. ఇందులో భాగంగానే 'హాట్‌షాట్స్‌' యాప్‌ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు. రాజ్‌కుంద్రా అరెస్ట్‌ బాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది.