గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (19:52 IST)

షెర్లిన్ చోప్రాపై రూ.50కోట్ల పరువునష్టం దావా వేసిన శిల్పా దంపతులు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. మరోవైపు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనను బెదిరించారంటూ మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా, శిల్ప తనపై లైంగిక దాడికి కూడా యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో షెర్లిన్‌పై శిల్ప, రాజ్ కుంద్రా న్యాయపరమైన చర్యలకు దిగారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యహరించిందంటూ షెర్లిన్‌పై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. 
 
ఈ సందర్భంగా శిల్ప, రాజ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని చెప్పారు. వారిని కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేశారని తెలిపారు. షెర్లిన్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.